ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 21, 2020 , 05:39:05

‘ఉపాధి’లో అక్రమాలు

‘ఉపాధి’లో అక్రమాలు

కూలీలు వలస వెళ్లకుండా ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే సారంగాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం వద్ద గురువారం జరిగిన ప్రజావేదికలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

  • రూ. 76,190 దుర్వినియోగం
  • ఇద్దరు ఎఫ్‌ఏల సస్పెన్షన్‌
  • ఏపీవో, టీఏలను బదిలీ చేయాలని ఆదేశం
  • సారంగాపూర్‌లో నిర్వహించిన ప్రజావేదికలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు

సారంగాపూర్‌:  కూలీలు వలస వెళ్లకుండా ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే సారంగాపూర్‌ మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం వద్ద గురువారం జరిగిన ప్రజావేదికలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.  2018 అక్టోబర్‌ ఒకటి నుంచి 30-11-2019 నవంబర్‌ 30 వరకు మండలంలోని 32 గ్రామపంచాయతీల్లో జరిగిన పనులపై సామాజిక బృందం సభ్యులు వారం రోజుల పాటు తనిఖీలు నిర్వహిం చారు. మొత్తం 1587 పనులు గాను రూ. 7కోట్ల 78లక్షల 48,426లు కూలీలకు వేతనాలు చెల్లించారు. మెటీరియల్‌ పేమెంట్‌ కింద రూ. 6,38,102 పంపిణీ చేశారు. ఎఫ్‌,ఏ, టీఏలు కలిసి రూ. 76,190 దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఇందులో రూ. 56,590 రికవరీ, రూ. 19,500 పెనాల్టీ విధించినట్లు డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. 


ఇద్దరు ఎఫ్‌ఏల తొలగింపు....

మండలంలోని కౌట్ల(బి), వంజర్‌ గ్రామాలకు చెందిన ఎఫ్‌ఏలు నారాయణ, రాజు అక్రమాలకు పాల్పడంతో ఇద్దరిని డీఆర్‌డీవో సస్పెండ్‌ చేశారు. ఏపీ వో జయదేవ్‌, టీఏ గంగన్న గోపాల్‌పేట్‌లో కూలీలు పని చేసిన మస్టర్లను ఇవ్వకపోవడం, గ్రామాల్లో నర్సరీలు పూర్తికాకపోవడంతో  వీరిని బదిలీ కోసం హెచ్‌ఆర్‌ సుధాకర్‌ను రిపోర్టును తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, హెచ్‌ఆర్‌సీ సుధాకర్‌, ఎస్‌ఆర్‌పీ హరీశ్‌, సర్పంచ్‌ సుజాత, ఎంపీటీసీ సామల పద్మ, ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత, ఏపీవో జయదేవ్‌, రిటైర్డు ఎంపీడీవో గుమ్ముల గంగాధర్‌, సర్పంచ్‌లు మురళీకృష్ణ, లక్ష్మి, నాయకులు దండుసాయికృష్ణ  తదితరులు పాల్గొన్నారు.logo