బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 20, 2020 , 00:16:52

కలెక్టర్‌ పల్లె నిద్ర

కలెక్టర్‌ పల్లె నిద్ర


పెంబి: మండలంలోని తాటిగూడ గ్రామంలో కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. రాత్రి 10.40 గంటలకు గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌ అర్ధరాత్రి వరకూ వివిధ అంశాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామంలోని అక్షరాస్యులు, నిరక్షరాస్యుల వివరాలను తెలుసుకున్నారు. నిరక్షరాస్యులను కనీసం తమ పట్టాపాస్‌పుస్తకం, ఆధార్‌కార్డులో వివరాలు చదివేలా సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగాఉంచాల్సిన బాధ్యత మీదేనని గ్రామస్తులకు సూచించారు. పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుళ్లారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్‌ పల్లెనిద్ర చేశారు.  కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ ఖలీం, ఎంపీడీవో సాయన్న, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తానాజీ, పెంబి సర్పంచ్‌ పూర్ణచందర్‌రావు, జడ్పీటీసీ జానుబాయి, ఎంపీపీ కవిత తదితరులు ఉన్నారు. 


logo