బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 19, 2020 , 02:59:15

నేడు శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి

నేడు శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : బంజారాల ఆరాధ్యదైవమైన శ్రీసంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి నేడు. జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్‌ మినీ స్టేడియంలో జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టెంట్‌, తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.

హాజరుకానున్న ప్రముఖులు, అధికారులు..

సేవాలాల్‌ జయంతి వేడుకలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ కొరిపెల్లి విజయ లక్ష్మి, ఎంపీ సోయం బాపు రావు, ఖానాపూర్‌, ముథోల్‌ ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, విఠల్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌తో పాటు కలెక్టర్‌ ముషారప్‌ అలీ ఫారుఖ్‌, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, ఎస్పీ శశిధర్‌ రాజు, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి హాజరుకానున్నారు.

ఏర్పాట్లను పరిశీలించిన నిర్వాహకులు

సంత్‌సేవాలాల్‌ జయంతి వేడుకలను స్టేడియం లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను మంగళవారం నిర్వహణ కమిటీ సభ్యులు  పరిశీలించారు. నిర్వహణ కమిటీ అధ్యక్షుడు తుకా రాం, భుక్య రమేశ్‌, సంతోష్‌, మురారి ఉన్నారు.


logo
>>>>>>