బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 19, 2020 , 02:56:37

ఆకట్టుకున్న బాడీ బిల్డింగ్‌ పోటీలు

ఆకట్టుకున్న బాడీ బిల్డింగ్‌ పోటీలు

సీసీసీ నస్పూర్‌ : మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన బాడీ బిల్డింగ్‌ పోటీలు ఆకట్టుకున్నాయి. సీసీసీ నస్పూర్‌కు చెందిన మిస్టర్‌ సౌత్‌ ఏషియా, స్కైజిమ్‌ నిర్వాహకుడు కొలిపాక వెంకటేశ్వర్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలను నిర్వహించారు. నస్పూర్‌కాలనీ సేవా భవన్‌ సీఈఆర్‌ క్లబ్‌ ఆవరణలో మంగళవారం రాత్రి ఈ పోటీలు ప్రారంభం కాగా, ఉమ్మడి జిల్లాలోని వివిధ జిమ్‌ల నుంచి సుమారు 70మంది బాడీ బిల్డింగ్‌ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. యువత తాము ఎంచుకున్న క్రీడల పట్ల కఠోర సాధన చేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా బాడీ బిల్డర్లు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీలకు సీనియర్‌ బాడీ బిల్డర్లు సమ్మయ్య, చందు, నర్సింగరావు, బక్కన్న, నర్సింగ్‌ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ బండి పద్మ, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు పిట్టల రవి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌గౌడ్‌, ఆర్గనైజర్‌ మురహరిరావు, మంచిర్యాల జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట తిరుపతి, ప్రధాన కార్యదర్శి గడప రాకేష్‌, మిస్టర్‌ ఇండియా బాడీ బిల్డర్‌ ఓరం సురేశ్‌, టీబీజీకేఎస్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo