సోమవారం 30 మార్చి 2020
Nirmal - Feb 18, 2020 , 00:09:21

ప్రజావాణి వినతులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో..

ప్రజావాణి వినతులు ఇక నుంచి ఆన్‌లైన్‌లో..

నిర్మల్‌ టౌన్‌ : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి పారదర్శకంగా సేవలందిస్తున్నదని, అర్జీల సత్వర పరిష్కారానికి ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను మొదటగా అధికారులు స్కానింగ్‌ చేసి ఆయా శాఖలకు చెందిన అధికారులకు కలెక్టర్‌ సమక్షంలో అందజేశారు. ఇందుకోసం కలెక్టర్‌ కార్యాలయంలో 15 టేబుళ్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఒక్కొక్క టేబుల్‌కు మూడు శాఖల అధికారులను కేటాయించారు. వచ్చిన అర్జీలను తీసుకున్న కలెక్టర్‌ వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి ఇక తావుండదని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో సోమేశ్వర్‌, ఆర్డీవో ప్రసునాంబ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


logo