శనివారం 15 ఆగస్టు 2020
Nirmal - Feb 17, 2020 , 03:02:09

పులి హల్‌చల్‌

పులి హల్‌చల్‌

భీంపూర్‌ : సరిహద్దు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో పెద్ద పులి తన ఉనికి చాటుకుంటూనే ఉన్నది. భీంపూర్‌ మండలం తాంసి(కె) గ్రామ సమీప పెన్‌గంగ ఒడ్డునే ఆదివారం  మధ్యాహ్నం పెద్దపులి  పశువులపై దాడి చేసింది.  వైద్య రవీందర్‌కు చెందిన  ఎద్దులపై  పులి పంజా విసిరింది. ఈ సంఘటనలో ఒక ఎద్దు  మృతి చెందగా, మరో ఎద్దు , దూడ తీవ్రంగా గాయపడ్డాయి. వరుస పులి ఉదంతాలతో  భయాందోళనలకు గురైన గ్రామస్తులు డప్పు చప్పుళ్లు, కేకలు వేస్తూ పులిని ఆ ప్రాంతం నుంచి సాగనంపే  యత్నం చేశారు. ఆదిలాబాద్‌ ఎఫ్‌డీవో ప్రభాకర్‌, ఆర్డీవో సూర్యనారాయణ , ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌,  సీఐ పురుషోత్తమాచారి, అటవీశాఖాధికారులు అప్పయ్య, గీరయ్య, గులాబ్‌సింగ్‌, కేశవ్‌ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, పులి సంరక్షణ బాధ్యత అని అవగాహన కల్పించారు.


 ముమ్మరంగా సంరక్షణ చర్యలు 

 తాంసి(కె) అటవీ ప్రాంతంలో  అధికారులు పులి సంరక్షణ చర్యలను ముమ్మరం చేశారు. బేస్‌ క్యాంపు కొనసాగుతున్నది. ైస్ట్రెకింగ్‌ ఫోర్స్‌ గస్తీ ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల నిఘా కొనసాగుతున్నది. అటవీశాఖాధికారులు గ్రామాల్లో పులి సంరక్షణ గురించి అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లోకి అపరిచిత వ్యక్తులు వస్తే సమాచారం ఇవ్వాలని, చేలలో అడవి పందుల కోసం గుళికలు పెట్టరాదని అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలో వాచ్‌ టవర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


logo