బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 16, 2020 , 01:17:58

ప్రతీ గిరిజనుడు సేవాలాల్‌ మార్గంలో నడవాలి

ప్రతీ గిరిజనుడు సేవాలాల్‌ మార్గంలో నడవాలి
  • రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సారంగాపూర్‌:   ప్రతి గిరిజనుడు సేలాలాల్‌ అనుసరించిన మంచి మార్గంలోనే నడుచుకోవాలని, మద్యానికి దూరంగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని దేవినగర్‌ తండాలో 281 సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథగి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సేవాలాల్‌ జయంతిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారికంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్‌లోని దివ్యాగార్డెన్‌ పక్కన బంజార భవన్‌ కోసం అర్ధ ఎకరం భూమి కెటాయించామని వెల్లడించారు. ఈనెల 19 ఇదే మైదానంలో సేవాలాల్‌ జయంతిని జరుపుతున్నట్లు పేర్కొన్నారు. బోథ్‌-అడెల్లి రోడ్‌ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, ప్రభుత్వం రూ. 6కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో రోడ్డు పనులు ప్రారంభమవుతాయన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అడెల్లి పోచమ్మ వద్దకు వచ్చే భక్తులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అల్లోల మురళీధర్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, సర్పంచ్‌లు నందినిదిలీప్‌, నిషాగజేందర్‌, తిరుమలరవీందర్‌, సుచరిత, సురేశ్‌, రామారావు, ఎంపీటీసీ రాజు, పవార్‌కైలాస్‌, నాయకులు నర్సారెడ్డి, ప్రకాష్‌, నాగయ్య, జనార్దన్‌నాయక్‌, భీంరావ్‌, లక్ష్మణ్‌, శంకర్‌ పాల్గొన్నారు.


logo