మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 16, 2020 , 01:09:48

‘పట్టణ ప్రగతి’కి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి

‘పట్టణ ప్రగతి’కి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి

నిర్మల్‌ టౌన్‌:  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో మున్సిపల్‌ కమిషనర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ఖానాపూర్‌, నిర్మల్‌, భైంసా మున్సిపాలిటీల్లో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.ప్రతి వార్డులో నాలుగు కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం లోగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక్కో కమిటీలో 15మంది సభ్యులు ఉండాలన్నారు. కమిటీలో యూత్‌, మహిళా, సీనియర్‌ సిటిజన్‌ ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ భాస్కర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ విధానం అమలు చేయాలి

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వందశాతం ఈ-ఆఫీస్‌ విధానం ద్వారా ఫైళ్లు నిర్వహించాలని  కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ అధికారుల పారదర్శకతలో భాగంగా సోమవారం నుంచి జిల్లాలో ఈ-ఆఫీస్‌ పాలన ప్రారంభిస్తున్నామని  అధికారులకు వివరించారు. జిల్లాలో పనిచేసే అధికారులు అనుమతి లేకుండా జిల్లా హెడ్‌క్వార్టర్‌ను విడిచివెళ్లవద్దని సూచించారు.


logo
>>>>>>