మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Feb 15, 2020 , 01:53:30

నేషనల్‌ హైవే పీడీపై మంత్రి, ఎంపీ ఆగ్రహం

నేషనల్‌ హైవే  పీడీపై మంత్రి, ఎంపీ ఆగ్రహం

నిర్మల్‌ టౌన్‌: నిర్మల్‌ జిల్లాలో జాతీయ రహదారులపై నిర్వహిస్తున్న టోల్‌ప్లాజాలో సిబ్బంది పనితీరు సక్రమంగా లేదని, ఎవరిని గౌరవించడం లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పీడీ తరుణ్‌జోషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఓ సమావేశానికి పీడీ తరుణ్‌జోషి హాజరుకాగా.. జాతీయ రహదారులపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు జోక్యం చేసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఇతర జిల్లాల్లో సెంట్రల్‌ లైటింగ్‌, ఇతర సౌకర్యాలు కల్పించిన హైవే అధికారులు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ ప్రజలంటే చిన్న చూపా అని పీడీని నిలదీశారు. 


ఇటీవల దిలావర్‌పూర్‌ మండలంలో ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాలో జిల్లా అధికారులకు, అంబులెన్స్‌లకు మినహాయింపు ఇవ్వడం లేదని జిల్లా అధికారులు మంత్రికి ఫిర్యాదు చేశారు. పన్నులు వసూలు చేస్తున్న శ్రద్ధలో అక్కడ కనీస సౌకర్యాలు కల్పించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి జిల్లా అధికారులకు, మీడియా పాత్రికేయు లకు, వీఐపీలకు, లోకల్‌ ప్రజాప్రతినిధులకు టోల్‌ప్లాజాలో రుసుము వసూలు చేయవద్దని, ఈ ప్రక్రియ రెండు రోజుల్లో ప్రారంభించాలన్నారు.  కలెక్టర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఎందుకు అమలు చేయడం లేదని పీడీని అడుగగా.  నేషనల్‌ హైవే రూల్స్‌ పాటిస్తున్నామని చెప్పడంతో రూల్స్‌ పాటించే వారు మరీ ప్రజలకు ఏమి సౌకర్యాలు కల్పిస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పద్ధతి మార్చుకోవాలని కనీసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు గౌరవించాలని సూచించారు. 


రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక 

తానూర్‌: మండల ంలోని ఝరిబి గ్రామా నికి చెందిన ఆర్‌. కృష్ణ కానిస్టేబల్‌, ఎల్‌. రా జు రాష్ట్రస్థాయి సీని యర్‌ కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యారు. ఈ నెల 13న భైంసా పట్టణంలోని వాసవి గురుకులంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డి పోటీల్లో ఆర్‌.కృష్ణ, ఎల్‌. రాజులు ప్రతిభను కనబర్చి రాష్ట్రస్థాయి కబడ్డి పోటీలకు ఎంపిక య్యారు. కాగా ఎల్లందు కొత్తగూడేం బద్రాద్రిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఇద్దరిని గ్రామస్తులు  అభినందించారు.


ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన

నిర్మల్‌ టౌన్‌: ప్రభుత్వ కార్యాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఈ -మేనేజర్‌ నదీం అన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వివిధశాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ అధికారులకు ఆన్‌లైన్‌ సేవలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్నందున ఆన్‌లైన్‌ డేటా పక్కగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా భూరికార్డులతో పాటు ఆఫీసు రికార్డులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించా రు. ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.


logo