శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 15, 2020 , 01:46:15

ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి జరగాలి

ప్రభుత్వ పథకాలతో పేదలకు లబ్ధి జరగాలి
  • జిల్లాలో ఉపాధి హామీ ద్వారా రూ.94 కోట్ల పనులు
  • ‘రూర్బన్‌' కింద కుంటాల మండలంలో రూ.4.5 కోట్లతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు
  • దిశ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు

నిర్మల్‌ టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పేదలకు లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం దిశ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌ ఎంపీ సోయం బాపురావుతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో దిశ విజిలెన్స్‌ మానటరింగ్‌ కమిటీ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ...జిల్లాలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న పథకాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రజలు క్యాష్‌ రూపంలో అందించిన డబ్బుల ద్వారానే ప్రభుత్వ పథకాలకు ఆదాయం వస్తుందని ప్రజలు చెల్లించిన డబ్బుతోనే ప్రభుత్వ పథకాలు సంక్షేమం కోసం అమలు చేస్తున్నామని తెలిపారు. 


ఉపాధిహామీ పథకంలో ఇప్పటివరకు 94కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇందులో శ్మశానవాటికల నిర్మాణం, నర్సరీల ఏర్పాటు, చెత్త డంపింగ్‌ల నిర్వహణ వంటి పనులు చేపట్టామని వివ రించారు. ప్రధానమంత్రి కిసాన్‌ యోజ న ఆవాస యోజన, సడక్‌ యోజన పథకం వంటి పథకాలపై సమీక్షించారు. జిల్లాలో కుంటాల మండలంలో రూర్బ న్‌  పథకానికి రూ. 15కోట్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు రూ.4.5 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. పల్లెల్లో 7కోట్లతో సీసీ రోడ్లు చేపట్టడం జరిగిందన్నారు. ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధుల ను సక్రమంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, డీఆర్‌వో సోమేశ్వర్‌, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌, జిల్లా అధికారులు కోటేశ్వర్‌రావు, సురేందర్‌రావు, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, అధికారులు నర్సింహారెడ్డి, రాజగోపాల్‌, హరికృష్ణ, వసంత్‌రావు, కిషన్‌యాదవ్‌, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo