బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 14, 2020 , 00:02:59

అధైర్యపడకండి.. అండగా ఉంటాం!

అధైర్యపడకండి.. అండగా ఉంటాం!

భైంసా, నమస్తే తెలంగాణ : కోర్వగల్లి వాసులు అధైర్యపడొద్దని, వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో కోర్వగల్లి వాసులతో సమావేశం నిర్వహించి ఇరువర్గాల కుటుంబాల్లో ధైర్యాన్ని నింపారు.  ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఇటీవల భైంసా పట్టణంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. ఇక నుంచి ఎవరి పనులు వారు చేసుకుంటూ మునుపటిలా ప్రశాంత జీవితాన్ని గడపాలని సూచించారు. ఎలాంటి ఆపద వచ్చినా డయల్‌ 100 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు. ఇరు వర్గాల ప్రజలు సంయమనం పాటించి ఒకరికొకరు సహకరించుకోవాలని అన్నారు. భైంసాలో ప్రస్తుతం పటిష్టభద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గడిచిన సంఘటనను పీడకలగా భావించి ఎవరి పనులు వారు చేసుకోవాలని అన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని,  వదంతులు సృష్టించే వారిపై, పంపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  అనంతరం బాధితులకు నిత్యం అవసరమయ్యే వంట పాత్రలను పంపిణీ చేశారు.  భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, పట్టణ సీఐ వేణుగోపాల్‌రావు, షీటీం ఎస్సై అంజమ్మ, సఖి కౌన్సెలింగ్‌ సెంటర్‌ సభ్యులు, వైద్యులు  పాల్గొన్నారు. 


logo
>>>>>>