శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 13, 2020 , 23:59:49

మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం పట్టణంలోని పలు వార్డులకు చెందిన మైనార్టీలకు మంజూరైన రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అమలు పర్చని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమ లు చేస్తోందని అన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌ ఖాన్‌, కౌన్సిలర్లు తదితరులున్నారు.

వైద్యుల సంఘ భవనానికి కృషి చేస్తా

వైద్యుల సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఐఎంఏ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంత్రిని పూలమాల శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వైద్య వృత్తికి, వైద్యులకు, వైద్యుల సంఘానికి తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన గండ్రత్‌ ఈశ్వర్‌ను మున్సి పల్‌ కార్యాలయంలో సంఘం నాయకులు సన్మానించారు.కార్యక్రమంలో రాష్ట్రకార్యవర్గ సభ్యులు అప్పాల చక్రదరి, రమేశ్‌, ఐఎంఏ అధ్యక్షుడు రమేశ్‌, సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ దామెర రాములు, రవి, శ్రీనివాస్‌, చంద్రికా, కృష్ణం రాజు, వెంకట్‌ రావు, మల్లికార్జున్‌, రాజేందర్‌, మోహన్‌ మూర్తి, హన్మంత్‌ రెడ్డి, దేవిదాస్‌, నరేందర్‌ రెడ్డి, ప్రశాంత్‌, అవినాష్‌, దామెర వరుణ్‌ తదితరులున్నారు.logo