శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 13, 2020 , 23:58:04

18న పంచాయతీరాజ్‌ సమ్మేళనం

18న పంచాయతీరాజ్‌ సమ్మేళనం

నిర్మల్‌ టౌన్‌: ఈనెల 18న జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పంచాయతీరాజ్‌ సమ్మేళనం, పల్లె ప్రగతి గ్రామాల అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ సమ్మేళనానికి మంత్రితో పాటు జడ్పీ చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను వేగంగా లక్ష్యం మేరకు పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికల నిర్మాణం, గ్రామానికొకనర్సరీ, ఇంటికో మరుగుదొడ్డి ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్రతి గ్రామంలో ఈనెలాఖరు వరకు డంపింగ్‌యార్డు, శ్మశానవాటికలను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీటి కోసం ప్రభుత్వ స్థలం లేనిచోట ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కోసం స్థలాలను కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20లోపు జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్లు కొనుగోలు చేయాల్సిందేనని సూచిం చారు. జిల్లా అటవీశాఖ అధికారి సుధాన్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, డీపీవో శ్రీనివాస్‌, ఆర్డీవో ప్రసూనాంబ, రాజు, పంచాయతీరాజ్‌,ఆర్‌అండ్‌బీ  ఈఈలు సుదర్శన్‌రావు, శ్రీనివాసరావు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 


logo