ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 12, 2020 , 23:24:04

రోజంతా సమీక్షలు

రోజంతా సమీక్షలు

నిర్మల్‌ టౌన్‌: దేశానికి వ్యవసాయమే ప్రధాన జీవనా ధారమని అటువంటి వ్యవసాయ రంగంలో ఆధునిక  సాంకేతికను జోడించి వ్యవసాయ రంగ ఉత్పత్తులను పెంచేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ ముస్తాఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్‌ కార్యాల యంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవా రం ఏర్పా టు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. వ్యవసాయ అభివృద్ధి అధికారులు చేపట్టవలసిన చర్యలు, కిసాన్‌ క్రెడిట్‌కార్డు, కిసాన్‌ యంత్ర తదితర పథకాల గురించి సమీక్షించారు. జిల్లాలో వ్యవ సాయ వనరుల ఉత్పత్తికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, దాన్ని సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే జిల్లాలో రైతుల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రతీ వ్యవసా యశాఖ అధికారి క్షేత్రస్థాయిలో రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, పంట దిగుబడులు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పుష్కలమైన నీటి వనరులు ఉన్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు. పెట్టుబడి సాయం కింద రూ.5వేలతో పాటు రైతుబీమా, ఇన్సురెన్స్‌ వంటి పథకాలను వివరించారు. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. రైతులకు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా వాటిని పరిష్కరించాలన్నారు. వాన కాలం, యాసంగిలో రైతులకు అవసరమయ్యే రుణాలను బ్యాంకుల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ను ఆదేశించారు. అదనపు పరిపాలన కలెక్టర్‌ భాస్కర్‌రావు మాట్లాడుతూ అన్నిశాఖల కన్నా వ్యవసాయశాఖ ఆదర్శంగా ఉందని ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించిన వ్యవసాయశాఖ అధికారుల భాగస్వామ్యంతో విజయవంతం చేశామ న్నారు. 

కార్యక్ర మంలో కిసాన్‌ యాప్‌ యంత్రాలపై అవగాహన కల్పించా రు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి కోటేశ్వర్‌రావు, మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌, ఎల్‌డీఎఫ్‌ బాలకృష్ణ, బీసీ సంక్షేమశాఖ అధికారి సాయిబాబా, మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి రాజగోపాల్‌, గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రెడ్డి, ఏడీఏలు సోమ లింగారెడ్డి, వినయ్‌కుమార్‌, అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo