శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 12, 2020 , 23:12:18

బాలికలను ఉన్నత చదువులు చదివించాలి

బాలికలను ఉన్నత చదువులు చదివించాలి

జైనథ్‌ : బాలికలను ఉన్నత చదువులు చదివించాలని జైనథ్‌ ఎంపీపీ మార్సెట్టి గోవర్ధన్‌ అన్నారు. జైనథ్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ‘బేటీబచావో.. బేటీపడావో’ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ ఆడ పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తుందన్నారు. సమాజంలో స్త్రీలకు రక్షణ లేక పోవడం, శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక పరమైన హింసలకు గురవుతున్నారన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఏడాది పసిపాప నుంచి వృద్ధుల వరకు లైంగికదాడి, అవమానాలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలు ఆపదలో ఉంటే 181 హెల్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. బాల కార్మికులతో పాటు బాల్య వివాహాలను నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఇద్దరు పిల్లలను బాగా చదివిస్తున్న అంగన్‌వాడీ టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, సీడీపీవో విజయ, మండల వైద్యురాలు దీపిక, బాలల సంరక్షణ అధికారి రాజేందర్‌, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సునీతదేవి, సర్పంచ్‌ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 


logo