గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 12, 2020 , 23:09:20

ఇబ్బందుల్లో ఉంటే షీటీంకు సమాచారం అందించాలి

ఇబ్బందుల్లో ఉంటే షీటీంకు సమాచారం అందించాలి

బేల : మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా షీటీంకు లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలని షీటీం ఇన్‌చార్జి అధికారి అనిత అన్నారు. బుధవారం బేల మండల కేంద్రంలోని కీర్తన డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళాశాలకు వచ్చే సమయంలో పోకిరీలు మహిళలను వేధిస్తున్నారని, వారి బారిన పడకుండా ఉండాలంటే  షీటీంకు సమాచారం అందించాలని అన్నారు. ప్రతి రోజూ జరుగుతున్న సంఘటనలు దృష్టిలో ఉంచుకొని మహిళలు జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రిన్సిపాల్‌ వరప్రసాదరావు, షీటీం అధికారులు, కళాశాల సిబ్బంది పుష్ప పాల్గొన్నారు.


logo
>>>>>>