శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 23:45:55

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

ఖానాపూర్‌ : మార్చి 4వ తేదీ నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని నిర్మల్‌ ఆర్డీవో ప్రసూనాంబ అన్నారు. మంగళవారం ఆమె ఖానాపూర్‌ , కడెం, మామడ తదితర ప్రభుత్వ, ప్రైవేట్‌  కళాశాలలను సందర్శించారు. పది, ఇంటర్‌ పరీక్షల  సందర్భంగా ఖానాపూర్‌లోని ప్రభుత్వ కళాశాల, ఏఆర్‌ఎస్‌వో కళాశాలను ఆమె సందర్శించారు. పరీక్షలకు వసతుల ను గురించి స్వయంగా పరిశీలించారు. పరీక్షల స మయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్‌ జాదవ్‌ పరుశురాం, ఏఆర్‌ఎస్‌వో కళాశాల ప్రిన్సిపాల్‌  శ్రీకాంత్‌, కిషోర్‌కు సూచించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయిం చాలని సూచించారు.ఆర్డీవో ప్రసూనాంబను ప్రిన్సిపాల్‌ జాదవ్‌ పరుశురాం శాలువాతో సన్మానించారు. 

మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శన

పట్టణంలోని విద్యానగర్‌లో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలను అధికార బృందం  పరిశీలించింది.ప్రైవేట్‌ వ్యక్తికి సంబంధించిన అద్దె భవనంలో మైనారిటీ గురుకుల పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పాఠశాల అద్దె చెల్లింపు నిర్ణయం కాలేదు. ఆర్డీవో ప్రసూనాంబ, తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల జిల్లా అధికారి, ఎంపీడీవో బాలే మల్లేశం,రోడ్లు భవనాల శాఖ అధికారి  డీఈ మల్లారెడ్డి  తదితరులు గురుకుల పాఠశాల భవనాన్ని పరిశీలించి కొలతలు, భవనంలోని వసతులను పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌ కు పంపించనున్నారు. తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల మైనారిటీ ప్రిన్సిపాల్‌ బియాబాని పాల్గొన్నారు.

విద్యాప్రమాణాలను పెంచాలి

కడెం: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచాలని ఆర్డీవో ప్రసూనాంబ పాఠశాల, కళాశాల సిబ్బందిని ఆదేశించారు. కడెం మండలకేంద్రంలో ప్రభుత్వ పాఠశాల, జూనియర్‌ కళాశాలను సందర్శించారు. అక్కడ పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు అమలు చేస్తున్న కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. కడెం తహసీల్దార్‌ నరేందర్‌, నాయబ్‌తహసీల్దార్‌ గంగాధర్‌, ఆర్‌ఐలు శ్రీనివాస్‌, రాజన్న, కార్యాలయ సిబ్బంది, తదితరులున్నారు. 

మామడలో..

మామడ : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆర్డీవో ప్రసూనాంబ మంగళవారం పరిశీలించారు.  కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్‌ పరీక్షల కేంద్రాన్ని, వసతులకు సంబంధించిన వివరాలను ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు.పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రవిచంద్రకుమార్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, అధ్యాపకులు పాల్గొన్నారు


logo