గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 23:45:55

పట్టణ సమస్యలను పరిష్కరిస్తా

పట్టణ సమస్యలను పరిష్కరిస్తా

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ:  కాలనీలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌ కాలనీలో పర్యటించారు.కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరంకాలనీ వాసులు చైర్మన్‌ను పూలమాల శాలువాతో సన్మానించా రు.కాలనీ అధ్యక్షుడు ఆర్‌.విజయ్‌ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీకాంత్‌,ప్రసాద్‌ రావు తదితరులున్నారు.

బ్రహ్మపురిలో సన్మానం

పట్టణంలోని బ్రహ్మపురి రామాలయంలో కొత్తగా ఎన్నికైన నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌తో పాటు స్థానిక కౌన్సిలర్లను ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజు రజక సంఘం కార్యాలయంలో సన్మానించారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు నల్లూరి పోశెట్టి, నాయకులు రామకృష్ణ, నజీర్‌, జగదీశ్‌, కృష్ణ తదితరులున్నా రు.రజక సంఘం నాయకులు శంకర్‌, ఊషన్న, రాజు, వెంకట రమణ, రాజు తదితరులున్నారు.

మెరుగైన పాలన అందిస్తా..

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అం దిస్తామని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నా రు. పట్టణంలో ని ప్రియదర్శినినగర్‌ కాలనీలో మంగళవారం  పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ ప్రదేశాల్లో ప్లాట్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్లాట్ల యజమానులకు సూచించారు. కాలనీలో మురికినీరు నిలిచి ఉం డడంతో దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వివరించడంతో వెంటనే శానిటరీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ఎర్రవోతు సురేందర్‌, చాహుస్‌ తదితరులున్నారు.


logo
>>>>>>