శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 11, 2020 , 23:42:06

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు

గుడిహత్నూర్‌ రూరల్‌ : నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు అని ఉట్నూర్‌ ఏఎస్పీ శబరీశ్‌ అన్నారు. మండలంలోని గురుజ్‌ గ్రామంలో మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో ఏర్పాటు చేసిన  సీసీ కెమెరాలను  ఏఎస్పీ  శబరీశ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ  మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగా సీసీ కెమెరాల  ఏర్పాటుకు వ్యాపారస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ, దాతలు సహకరించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితిలో సీసీ కెమెరాల అవసరం చాలా ఉందని తెలిపారు. చోరీలు, అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని వివరించారు.  రోజురోజుకూ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నదని దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలతో నేర నియంత్రణ, కేసు దర్యాప్తు సులభతం అవుతుందని  అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పోలీసులు కంట్రోలింగ్‌ మానిటర్‌ ద్వారా గుర్తించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో   ఇచ్చోడ సీఐ శ్రీనివాస్‌, గుడిహత్నూర్‌ ఎస్సై కొక్కెల రోహిణి, గ్రామసర్పంచ్‌ గోవింద్‌ , ఉపసర్పంచ్‌  అవినాష్‌, కార్యదర్శి తులసీరాం,  రాము గ్రామస్తులు పాల్గొన్నారు.logo