ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 11, 2020 , 01:01:30

లక్ష్మణచాంద సొసైటీ ఏకగ్రీవం

లక్ష్మణచాంద సొసైటీ ఏకగ్రీవం

లక్ష్మణచాంద: లక్ష్మణచాంద పీఏసీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కింది. నామినేషన్ల ఉపసంహరణ సోమవారంప్రధాన అభ్యర్థులు తప్పా మిగతా అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో  13 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ ప్రకటించారు. వీటీలో 8 స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులు, మరోఐదు స్థానాలు కాంగ్రెస్‌ పార్టీకి దక్కాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఉండడంతో చైర్మన్‌తోపాటు వైస్‌ చైర్మన్‌ పదవికూడా దక్కనుంది.  మండలంలో పీఏసీఎస్‌కు ఒకటో వార్డుకు చెవ్వ ఎర్రొల్ల చిన్న రాజేశ్వర్‌(కాంగ్రెస్‌), రెండో వార్డుకు కొచ్చల ముత్తవ్వ (టీఆర్‌ఎస్‌), మూడో వార్డుకు  కోండ్ర ముత్తవ్వ (టీఆర్‌ఎస్‌) , నాలుగోవార్డుకు నూతికాడి చిన్న రాజారెడ్డి( కాంగ్రెస్‌), ఐదో వార్డుకు  అబ్బడి రవి(టీఆర్‌ఎస్‌), ఆరో వార్డుకు  ఎర్ర ముత్యంరెడ్డి( కాంగ్రెస్‌), ఏడో వార్డుకు ఎర్ర  సరిత (టీఆర్‌ఎస్‌), ఎనిమిదో వార్డుకు ఎర్ర సుమలత (కాంగ్రెస్‌), తొమ్మిదో వార్డుకు కాసాని రవీంధర్‌(టీఆర్‌ఎస్‌),  పదో వార్డుకు ఎర్ర రఘునందన్‌ రెడ్డి(టీఆర్‌ఎస్‌), 11వ వార్డుకు సార్యం వెంకట్‌రాజు(టీఆర్‌ఎస్‌), 12వ వార్డుకు గూండ్ల కిషన్‌(టీఆర్‌ఎస్‌), ఎర్కరి నరేష్‌(కాంగ్రెస్‌) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

బన్సపల్లి సంఘానికి 10 టీసీల్లో పోటీ

దిలావర్‌పూర్‌: దిలావర్‌పూర్‌లోని బన్సపల్లి సహకార సంఘం నామినేషన్ల చివరి రోజు సోమవారం 10 టీసీలకు 20 మంది సభ్యులు బరిలో నిలిచినట్లు ఎన్నికల అధికారి స్రవంతి తెలిపారు. మిగిత మూడు టీసీలకు ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు. మూడో వార్డు టీసీ కంజర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థి నల్లసూర్యరెడ్డి, ఐదో వార్డుకు బన్సపల్లి నుంచి పీవీ రమణరెడ్డి, పదో వార్డుకు రాంపూర్‌ నుంచి రావుల భూమన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

రెండు సొసైటీల్లో18 టీసీలు ఏకగ్రీవం

సారంగాపూర్‌:  మండలంలోని కౌట్ల(బి), ఆలూర్‌ సహకార సంఘాలకు సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగినట్లు ఎన్నికల అధికారులు రాజశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌ తెలిపారు. ఇందులో కౌట్ల(బి) సహకార సంఘానికి 13 టీసీలకు గాను 11 టీసీలు, ఆలూర్‌ సహకార సంఘానికి 13 టీసీలకు గాను 07 ఏకగ్రీవమయినట్లు అధికారులు తెలిపారు. రెండు సొసైటీల్లో 8 టీసీలకు ఈనెల 15న ఎన్నికలు జరుగతాయన్నాయన్నారు. 

మామడలో 10 టీసీలు ఏకగ్రీవం

మామడ : మామడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 13టీసీలకు గాను పది టీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. మూడు టీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఒకటో టీసీకి గొల్లెన లింగన్న, రెండో టీసీకి సంక రాజేశ్వర్‌, మూడో టీసీకి చిక్యాల హరీశ్‌కుమార్‌, నాలుగో టీసీకి గొర్రె రాజన్న,  ఐదో టీసీకి కొత్తూరు సుగుణ,  ఆరో టీసీకి ఎర్ర ఇంద్ర,  తొమ్మిదో టీసీకి బర్కం సంతోశ్‌, 11వ టీసీకి చిక్యాల భాస్కర్‌రావు, 12వ టీసీకి రాథోడ్‌ కౌసల్య, 13వ టీసీకి రాథోడ్‌ కిషన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఏఓ టీసీ నుంచి నల్ల లింగారెడ్డి, ఏలేటి చిన్నారెడ్డి, ఎనిమిదో టీసీ నుంచి బోయిని లక్ష్మి, బోనగిరి లక్ష్మి, పదో టీసీ నుంచి జక్కుల మల్లేశ్‌, బర్కం మహేందర్‌ పోటీలో ఉన్నారు.


logo