ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 11, 2020 , 00:51:46

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : పరిసరాల శుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చునని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ..ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు విద్యార్థులందరికీ నులి పురుగుల మాత్రలను అందజేయాలని అన్నారు. పాఠశాల, ఇంటి పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థులకు అల్బెండనోజ్‌ మాత్రలు రక్తహీనతను నివారించి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ వసంత్‌ రావు మాట్లాడుతూ..ప్రతీ విద్యార్థి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని  సూచించారు. పాఠశాలలో ఉద్యోగ విరమణ పొందుతున్న ప్రధానోపాధ్యాయుడు రఘురాజ్‌ను పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్‌ అవినాష్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్‌ రాం రెడ్డి, సత్యనారాయణ, రవీందర్‌, విమల, రాజేశ్వర్‌, ఆనంద్‌, నర్సయ్య పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo