ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 10, 2020 , 00:00:35

‘సహకార’ నామినేషన్ల పరిశీలన పూర్తి

‘సహకార’ నామినేషన్ల  పరిశీలన పూర్తి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. జిల్లా వ్యాప్తంగా  ఆయా సహకార సొసైటీల పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాలకు మొత్తం 660 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 635 మిగిలాయి. వివిధ కారణాలతో 11 నామినేషన్లను, 14 డబుల్‌ నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దిలావర్‌పూర్‌ మండలంలోని బన్సపల్లి సహకార సొసైటీలో నాలుగు నామినేషన్లను, కడెం మండలం పాండ్వాపూర్‌ సొసైటీలో మూడు, లోకే

శ్వరం సొసైటీలో తొమ్మిది, నిర్మల్‌లో ఒకటి, ఆలూర్‌లో ఒకటి, కౌట్ల(బీ)లో ఒకటి, ముథోల్‌లో ఐదు, కుభీర్‌లో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. సోమవారం ఉపసంహరణకు గడువు ఉంది. ఉపసంహరణ  గడువు ముగిసిన అనంతరం బరిలో ఉండే అభ్యర్థులు ఎవరనేది తేలనుంది. 

దిలావర్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

దిలావర్‌పూర్‌: మండలకేంద్రంలోని బన్సపల్ల్లి సహకార సొసైటీ పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాలకు మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, అధికారుల పరిశీలనలో వివిధ కారణాలతో నాలుగు తిరస్కరణకు గురయ్యాయి. నాలుగు నామినేషన్లు కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులవి కావడం, ఆయా వార్డులకు టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల సింగిల్‌ నామినేషన్లు మిగలడంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. సంబురాల్లో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ బలపర్చిన చైర్మన్‌ అభ్యర్థి పీవీ రమణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకుడు ఏలాల చిన్నారెడ్డి, నర్సాపూర్‌(జీ) జడ్పీటీసీ రామయ్య, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌ పాల్ద్ధె శ్రీనివాస్‌, దనే రవి, పాల్దె అనిల్‌, ఎంపీటీసీలు రవి, అనిల్‌, మాజీ వైస్‌ ఎంపీపీ జీవన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


logo