ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 09, 2020 , 23:58:16

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

జైనథ్‌: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ఆలయాలు, ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఆదివారం మండలంలోని బాలాపూర్‌లో సద్గురు శ్రీ భూమయ్య మహరాజ్‌ 40వ పుణ్యతిథి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ.5 లక్షల నిధులతో నిర్మించిన మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక మార్గంతోనే సమాజంలో శాంతి నెలకొంటుందని అన్నారు. మహాపురుషులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. భూమ య్య మహరాజ్‌ తన భజన, సంకీర్తనలతో ఇక్కడి ప్రాంత ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలను పొంపొందించారని కొనియాడారు. ఇప్పటికీ ఆయన శిష్యులు భజన, సంకీర్తనలతో అందరి మన్ననలు పొందుతున్నారని గుర్తుచేశారు. పుణ్యతిథి సందర్భంగా ఆలయంలో హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. 

భజన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు..

సద్గురు భూమయ్య మహరాజ్‌ పుణ్యతిథిని పురస్కరించుకొని భజన పోటీలు నిర్వహించగా.. 17 బృందాలు పాల్గొన్నాయి. అందులో ప్రతిభ కనబర్చిన అందులో కరంజి(టి) బృందానికి మొదటి బహుమతిగా రూ.11వేలు మున్సిపల్‌ కౌన్సిలర్‌ ప్రేమేందర్‌ అందజేశారు. గుబిడి బృందానికి  రెండో బహుమతిగా రూ.9వేలు వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌ అందజేశారు. మూడో బహుమతి హస్నాపూర్‌ గెలుపొందగా.. రూ.5వేలను సర్పంచ్‌ జక్కుల వినోద్‌ అందజేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్‌ తల్లెల చంద్రయ్య, ఉప సర్పంచ్‌ గజానన్‌, నాయకులు శనిగారపు హన్మంతు, మాజీ సర్పంచ్‌ దామోదర్‌పాటిల్‌, గోవింద్‌రావు పాటిల్‌, కనక హన్మాండ్లు, గడసందుల రమేశ్‌తోపాటు ఆయా గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 

సమాజసేవలో ముందుండాలి..

ఎదులాపురం: సమాజసేవలో ఖత్రి సమాజ్‌ సభ్యులు ముందుండాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఖత్రి సమాజ్‌ భవనంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే, జడ్పీ వైస్‌ చైర్మన్‌  రాజన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమ్రేందర్‌ను  ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు నాకోడ్‌ శంకర్‌ ఖత్రి, ఉపాధ్యక్షుడు ప్రమోద్‌కుమార్‌ ఖత్రి,  గౌరవ అధ్యక్షుడు తులసీదాస్‌, కార్యదర్శి బి.రాజ్‌, సంయుక్త కార్యదర్శి నాకోడ్‌ రాజేశ్వర్‌ ఖత్రి, కోశాధికారి గజానన్‌, యూత్‌ అధ్యక్షుడు బారడి లక్ష్మీకాంత్‌, కార్యదర్శి మామిడి గణేశ్‌, ఉపాధ్యక్షుడు రాహుల్‌, సభ్యులు ప్రవీణ్‌, ప్రమోద్‌, సుశీల్‌, వెంకటేశ్‌, నీలేశ్‌, రాజు, శ్రీనివాస్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసీల అభ్యున్నతికి కృషి 

ఎదులాపురం:నియోజకవర్గంలోని ఆదివాసీల అభ్యున్నతికి తనవంతు కృషి చేస్తానని ఎమ్యెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని వాన్వట్‌లో హీరాసుక జయంతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. అందులో భాగంగా వారికి అనేక రాయితీలు కల్పించినట్లు గుర్తు చేశారు. ఐటీడీఏ ద్వారా సబ్సిడీపై కోట్లాది రూపాయాల  రుణాలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని ఆదివాసీ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ నిలిపి రహదారులు, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేశారు. ఆదివాసీ ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రీడలతో ఆరోగ్యం...

ఆదిలాబాద్‌ రూరల్‌: రోజూ ఆటలు ఆడితే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం మండలంలోని చాంద(టి)లో జోగు ఆశన్న స్మారక క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ  సందర్భంగా మాట్లాడుతూ.. యువత చెడు మార్గాలవైపు పయనించకుండా ఉండాలంటే క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలని అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొన్నవారు శారీరకంగా దృఢంగా ఉంటారని, ఉల్లాసం కలిగి మంచి ఆలోచనలతో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నారు. రెండేండ్లుగా చాందలో ఈ క్రికెట్‌ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. యువత బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ఆరె రాజన్న, సర్పంచ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo