మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 09, 2020 , 23:51:39

ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి

ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలి

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : ప్ర తి ఒక్కరూ ఆ ధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని రాష్ట్ర అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ ఫంక్షన్‌హాల్‌లో సాయిదీక్షా సేవాసమితి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన సాయిపారాయణ ముగింపు వేడుకలను ఆదివారం నిర్వహించగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ...నిత్యం బిజీ జీవితంలో ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని అన్నారు. పట్టణంలో సాయి భక్తులకు ఆధ్మాతికతను పెంపొందిస్తున్న సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్‌మోహన్‌ రెడ్డిని సన్మానించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాయి పల్లకీని ఊరేగించారు. భక్తిశ్రద్ధలతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. భక్తులకు వారం రోజుల పాటు ప్రవచనాలు బోధించిన  షిర్డీ సంస్థాన్‌ వికాస్‌ మహరాజ్‌ను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పూలమాల శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమెల్యే నల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ డైరెక్టర్‌ కొరిపెల్లి దేవేందర్‌ రెడ్డి, నందు సాయి దీక్షా సేవాసమితి సభ్యులు, పాల్గొన్నారు.

ఘనంగా బ్రహ్మేంద్ర స్వామి కల్యాణం

జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయంలో చేపట్టిన కల్యాణ మహోత్సవ వేడుకలకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణ కుంబంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మం త్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఎన్నికైన  మున్సిపల్‌ కౌన్సిలర్లను సన్మానించారు.  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, కౌన్సిలర్లు నేరేల్ల వేణు, కోటగిరి అశోక్‌, ఆలయ కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు


logo
>>>>>>