శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 09, 2020 , 01:43:56

‘సహకార’ నామినేషన్లు 661

‘సహకార’ నామినేషన్లు 661

నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:జిల్లాలో 17 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలుండగా..  నిర్మల్‌లో ఒక్క ఎఫ్‌ఎసీఎస్‌ ఉండగా.. మిగ తా 16చోట్ల పీఏసీఎస్‌లున్నాయి. జిల్లాలో నిర్మల్‌ మండలం మంజులాపూర్‌, ముఠాపూర్‌, మామడ, ఖానాపూర్‌ మండలం సత్తన్నపల్లి, ఖానాపూర్‌, సారంగాపూర్‌ ఆలూరు, కౌట్ల(బి), బాసర మండలం బిద్రెల్లి (ముథోల్‌), కుభీర్‌, కుంటాల, తానూరు మండలం హంగిర్గా, భైంసా మండలం మిర్జాపూర్‌, లోకేశ్వరం, లక్ష్మణచాంద, కడెం మండలం పాండ్వాపూర్‌, దిలావర్‌పూర్‌ మండలం బన్సపల్లిలో పీఏసీఎస్‌లు ఉన్నాయి. 17 సంఘాల పరిధిలోని 221 డైరెక్టర్ల స్థానాలకు ఈనెల 15న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు 40మంది నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజు 232 మంది, చివరిరోజైన శనివారం 389మంది నామినేషన్లు వేశారు. 


జిల్లావ్యాప్తంగా 221 టీసీలకుగాను 661మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. జిల్లాలో అత్యధికంగా కడెం మండలం పాండ్వాపూర్‌లో 57, అత్యల్పంగా సారంగాపూర్‌ మండలం కౌట్ల(బి)లో 31 నామినేషన్లు దాఖలయ్యాయి. 13టీసీలకు ఒకే ఒక్క నామినేషన్‌ రావడంతో అక్కడ ఎన్నిక ఏకగ్రీవమైంది. నిర్మల్‌ మండలంలోని మంజులాపూర్‌ 9, 13 టీసీలు, మామడలో 4,5,13, సారంగాపూర్‌ ఆలూరులో 11, తానూరు మండలం హంగిర్గాలో 9, భైంసా మండలం మిర్జాపూర్‌లో 4, లక్ష్మణచాంద మండలంలో 1,2,7,8,10 టీసీల డైరెక్టర్‌ స్థానాల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 661నామినేషన్లు దాఖలు కాగా నిర్మల్‌ ఎఫ్‌ఏసీఎస్‌కు 41, మంజులాపూర్‌లో 37, మామడ-32, ఖానాపూర్‌-43, ఆలూరు-32, కౌట్ల(బి)-31, సత్తన్నపల్లి-34, ముఠాపూర్‌-34, బిద్రెల్లి-42, కుభీర్‌-46, కుంటాలలో-45, హంగిర్గా-41, మిర్జాపూర్‌-38, లోకేశ్వరం-44, లక్ష్మణచాంద-32, పాండ్వాపూర్‌-57, బన్సపెల్లి-31 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన, సోమవారం ఉపసంహరణ, 15వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తవ్వగా, సోమవారం సాయంత్రానికి బరిలో ఉండేది ఎవరు? తప్పుకునేది  ఎవరు? అనేది తేలనుంది. సోమవారం తర్వాత ప్రచారం మరింత వేగం పుంజుకోనుంది. 


logo