బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 09, 2020 , 01:41:35

యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

దస్తురాబాద్‌ : గ్రామాల్లోని నిరుద్యోగ యువతీ, యువకులు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్‌ మంగీలాల్‌ అన్నారు. శనివారం మండలంలోని మున్యాల తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో యువతకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఉట్నూర్‌) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎసీ, రిఫ్రిజిరేటర్‌, ఎలక్ట్రానిక్‌ హౌస్‌వైరింగ్‌, ఫొటో, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌, టూవీలర్‌ మెకానిక్‌, ప్లంబింగ్‌, కంప్యూటర్‌ ట్యాలీ అంశాలపై పురుషులకు 30 రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. మహిళల కోసం కుట్టుమిషన్‌, బ్యూటీపార్లర్‌, మగ్గం వర్క్స్‌, జువెల్లరీలో  30 రోజుల పాటు శిక్షణ, ఆభరణాల తయారీ(గాజులు, సారీ పిన్స్‌)తదితర అంశాలపై 13 రోజుల పాటు శిక్షణ ఉంటుందని అన్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువ పత్రాలతో ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9949412159, 8096093085, 9441530494 నంబర్లను సంప్రదించాలని సూచించారు.  సురేశ్‌ నాయక్‌, సంస్థ డైరెక్టర్‌ పి. ఆశన్న, యువకులు, గ్రామ పెద్దలు నరేశ్‌, దేవేందర్‌, విలాస్‌, తిరుపతి పాల్గొన్నారు.logo