బుధవారం 08 ఏప్రిల్ 2020
Nirmal - Feb 08, 2020 , 03:41:43

వన్యప్రాణుల దాహార్తిని తీర్చాలి

వన్యప్రాణుల దాహార్తిని తీర్చాలి
  • అగ్ని ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  • కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌

ఖానాపూర్‌: ఎండాకాలం సమీపిస్తున్న దృష్ట్యా అటవీప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చీఫ్‌ కన్జర్వేటర్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ సీపీ వినోద్‌కుమార్‌ అన్నారు. ఖానాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని ఎక్బాల్‌పూర్‌, ఖానాపూర్‌ సౌత్‌ అటవీ ప్రాంతాన్ని, ఎక్బాల్‌పూర్‌ బేస్‌ క్యాంపును శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అటవీ, జంతు సంరక్షణ చర్యలపై రేంజ్‌ పరిధిలోని సిబ్బందికి  పలు సూచనలు చేశారు.


 ఖానాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని మొత్తం 128 కిలో మీటర్ల అటవీ ప్రాంతం యేటా అగ్నిప్రమాదాలకు గురవుతున్నదని, ఈ సారి ఫైర్‌ లైన్లగుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండాకాలం సీజన్‌ పూర్త య్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు వాగులు, చెలిమెలు ఉన్న చోట్ల నీటిఊటల కోసం తవ్వ కాలు చేయాలని, వాగులు లేని చోట్ల సాసర్‌పిట్లు నిర్మించి ట్యాంకర్ల సహాయంతో వాటిని నింపాలని సూచించారు. ఎక్బాల్‌పూర్‌ అడవుల్ల్లో ఉన్న బేస్‌క్యాంప్‌ శిబిరాన్ని కాలినడకన సీపీ సందర్శించారు. బేస్‌ క్యాంప్‌ సిబ్బందికి అటవీ రక్షణ చర్యలపై సూచనలు చేశారు. అ నంతరం ఖానాపూర్‌ సౌత్‌ ఫారెస్ట్‌లో నిర్మిస్తున్న గ్రీన్‌పార్కు పనులను ఆయన పరిశీలిం చారు. రూ.64 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని, త్వరి తగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట నిర్మల్‌ డీఎఫ్‌వో ఎస్‌పీ సుతాన్‌, ఖానాపూర్‌ ఎఫ్‌డీవో రాజ్‌గోపాల్‌, రేంజర్‌ జి.వినాయక్‌, సిబ్బంది ఉన్నారు. 


logo