బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 08, 2020 , 03:46:48

నామినేషన్ల జోరు

 నామినేషన్ల జోరు
  • రెండో రోజు భారీగా దాఖలు
  • స్వీకరణకు నేడు ఆఖరురోజు

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో సహకార ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండోరోజైన శుక్రవారం భారీ సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. మొదటిరోజు 40 నామినేషన్లు మాత్రమే దాఖలు కాగా.. రెండో రోజు శుక్రవారం 232 నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రత్యేకాధికారుల సమక్షంలో నామినేషన్లను స్వీకరించారు. ఆయా సహకార సంఘాల్లో నామినేషన్లను దాఖలు చేసుకునేందుకు అభ్యర్థులు తమ మద్దతుదారులతో రావడంతో కార్యాలయాల పరిసరాలు సందడిగా మారాయి. నామినేషన్ల దాఖలుకు శనివారం చివరిరోజు కావడంతో నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియను జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, జిల్లా నోడల్‌ అధికారి సూర్యచందర్‌రావు పరిశీలించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సహకార సంఘాల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాథమిక  సహకార సంఘాలకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు సైతం శుక్రవారం నామినేషన్లను దాఖలు చేశారు. 


రెండో రోజు దాఖలైన నామినేషన్ల వివరాలు..

జిల్లాలో శుక్రవారం మొత్తం నామినేషన్ల సంఖ్య 272కి చేరుకుంది. ఎఫ్‌ఎసీఎస్‌ నిర్మల్‌కు 15, మంజులాపూర్‌కు 23, మామడ-12, ఖానాపూర్‌ -13, ఆలూరు-16, కౌట్ల-18, సత్తన్నపల్లి-17, ముఠాపూర్‌-8, బిద్రెల్లి-14, కుభీర్‌-17, కుంటాల-10, హంగిర్గా-14, మిర్జాపూర్‌-11, లోకేశ్వరం-25, లక్ష్మణచాంద-17, పాండ్వాపూర్‌-23, బన్సపెల్లి-19 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా సహకార అధికారులు పేర్కొన్నారు. 


logo
>>>>>>