గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 08, 2020 , 03:31:07

విద్యార్థినులకు సరైన సౌకర్యాలు కల్పించాలి

విద్యార్థినులకు సరైన సౌకర్యాలు కల్పించాలి

ఉట్నూర్‌, నమస్తే తెలంగాణ: ఉన్నత కోర్సులను అభ్యసించేందుకు విద్యార్థినులను ఎంపికచేసిన అధికారులు వారిని నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి పంపించారని, అక్కడ వారికి సరైన వసతిసౌకరాలు కల్పించలేదని తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావు ఆరోపించారు. తమకు సరైన సౌకరాలు కల్పించాలని కోరుతూ విద్యార్థినులు శుక్రవాం ఐటీడీఏ కార్యాలయ ఏపీవో జనరల్‌ కనక భీంరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ ఐటీడీఏ ఆధ్వర్యంలో 22 మంది విద్యార్థులను జీఎన్‌ఎం/డీఎంఎల్‌టీ కోర్సుల అభ్యసనకుఎంపిక చేసి నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి పంపించారని, అవసరమైన రూంలు, సరైన భోజనం అందకపోవడం, పుస్తకాలు, యూనిఫాం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కళాశాల దూరంగా ఉండడంతో విద్యార్థినులు కాలినడకన వెళ్లాల్సి వస్తున్నదని, ఇన్ని ఇబ్బందులు మధ్య వారు అక్కడ ఉండలేకపోతున్నారని అన్నారు. ఆదివాసీ విద్యార్థులు చదవడం లేదని అధికారులు పేర్కొనడం సరికాదని, సరైన సౌకర్యాలు కల్పిస్తే ఎందుకు చదవరని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పం దించి విద్యార్థినులకు సౌకర్యాలు కల్పించని పక్షంలో ఆందోళనకు దిగుతామని అన్నారు. కార్యక్రమంలో నర్సింగ్‌ విద్యార్థినులు రాయిసిడాం గిరిబాయి, శోభ, శ్రీలత, కవిత, దీప, మంగళ, విజయలక్ష్మి, సుజాత, స్వప్న, హరిత, నాయకులు తిరుపతి పాల్గొన్నారు.logo