మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Feb 07, 2020 , 00:57:00

18 నుంచి జంతుగణన

18 నుంచి జంతుగణన

ఖానాపూర్‌: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌తో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జంతుగణనను పకడ్బందీగా చేపట్టాలని డీఎఫ్‌వో ఎఫ్‌పీ సుతాన్‌ అన్నారు. ఖానాపూర్‌లోని ఏఎంకే ఫంక్షన్‌హాల్‌లో గురువారం  ఖానాపూర్‌, నిర్మల్‌ డివిజన్‌లలోని ఐదు ఫారెస్ట్‌ రేంజ్‌ల సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేశారు. డీఎఫ్‌వోతో పాటు ఖానాపూర్‌ ఎఫ్‌డీవో జే.రాజ్‌గోపాల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జంతుగణన చేపట్టే పద్ధులను కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ బయాలజిస్ట్‌ జోగు యెల్లాం  ఐదు రేంజ్‌ల సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా యెల్లాం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని ఐదు బ్లాకులుగా విభజించడం జరిగిందన్నారు. ఒకటవ బ్లాకులో సిర్పూరు కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, రెండవ బ్లాకులో బెల్లంపల్లి, మూడవ బ్లాకులో ఖానాపూర్‌, నిర్మల్‌, నాల్గవ బ్లాకులో ఖానాపూర్‌, ఉట్నూరు, ఐదవ బ్లాకులో జన్నారం అటవీ ప్రాంతాలున్నాయని వివరించారు. 


కొన్ని బ్లాకుల్లోని అడవుల్లో గతేడాది డిసెంబరు నుంచి జంతుగణన ప్రారంభమైందన్నారు. మూడవ బ్లాక్‌లోని ఖానాపూర్‌-నిర్మల్‌ అటవీ ప్రాంతంలో ఈ నెల 18వ తేదీ నుంచి జంతుగణన ప్రారంభమవుతుందన్నా రు. ఉమ్మడి జిల్లాలోని పులుల సంఖ్య, మాంసాహార, శాఖాహార జంతువుల సంఖ్యను లెక్కించడం జరుగుతుందన్నారు. జంతువుల లెక్కలు తేలిన తరువాత వాటి సంరక్షణకు అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖ మరిన్ని మెరుగైన చర్యలు చేపట్టే అవకాశం అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి జి.వినాయక్‌, పెంబి రేంజర్‌ జీవీ రామకృష్ణ, మామడ, దిమ్మదుర్తి ఇన్‌చార్జి రేంజర్‌ రాజశేఖర్‌, డిప్యూటీ రేంజర్లు, సెక్షన్‌ అధికారులు, బీట్‌ అధికారులు, బేస్‌ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు. 


logo
>>>>>>