గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 07, 2020 , 00:53:19

తొలిరోజు 40నామినేషన్లు

తొలిరోజు  40నామినేషన్లు

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో సహకార ఎన్నికల సందడి ప్రారంభమైంది.  ఈ నెల 15న జరగనున్న సహకార ఎన్నిక నేపథ్యంలో తొలిరోజైన గురువారం జిల్లావ్యాప్తంగా 40 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో గల రైతు సేవా సహకార సంఘంతో పాటు బిద్రెల్లి, లక్ష్మణచాందలో తొలిరోజు నామినేషన్ల బోణి కాలేదు. మిగతా మంజులాపూర్‌ సహకార సంఘంలో ఆరు, మామడలో రెండు, ఖానాపూర్‌లో-4, ఆలూరు-1, కౌట్ల(బి)-4, సత్తన్నపల్లి-5, మూఠాపూర్‌-2, బన్సపెల్లి-1, కుభీర్‌-2, కుంటాల-1, హంగిర్గా-1, తానూరు-1, లోకేశ్వరం-4, పాండ్వాపూర్‌-2 నామినేషన్లు దాఖలైనట్లు  పేర్కొన్నారు.నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు అవకాశం ఉండడంతో నేడు,రేపు నామినేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు  ప్రత్యేక ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్లను స్వీకరించారు. పలు గ్రామాల్లోని సహకార సంఘాలను ఎస్పీ శశిధర్‌రాజు పరిశీలించారు.


ఎన్నికల ఏర్పాట్లపై అధికారుల దృష్టి...

 ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఎన్నికల ఫలితాలు ప్రకటించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించే వరకు ఆయా సహకార సంఘాలకు ప్రత్యేకంగా 17 మంది అధికారులను నియమించారు. ఒక్కో పీఏసీఎస్‌లో 13మంది డైరెక్టర్లు ఎన్నుకోవాల్సి ఉండగా.. జిల్లావ్యాప్తంగా 221 మెంబర్లను ఎన్నుకోనున్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించారు. ఇందుకోసం బ్యాలెట్‌  ఆధారంగా ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లాలో 245 పోలింగ్‌ బాక్స్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం సిబ్బందిని 697 మందిని నియమించారు. ఇందులో 241మంది పీఓలు, 241మంది ఏపీవోలు, 215మంది ఓపీలను నియమించారు. 


logo
>>>>>>