గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 05, 2020 , 00:53:48

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : ప్రజలకు మెరుగైన సేవలను అందించి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపర్చాలని మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ మున్సిపల్‌ అధికారులకు, సిబ్బందింకి సూచించారు. పట్టణంలోని మున్సిపల్‌ కా ర్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్‌ సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి విధులను బాధ్యతగా నిర్వర్తించాలని,  ఉద్యోగులు సమయపాలన పాటించాలని సూచించారు. మున్సిపల్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, డీఈ సంతోష్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo
>>>>>>