శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 04, 2020 , 00:18:28

తుది ఓటరు జాబితా విడుదల

తుది ఓటరు  జాబితా విడుదల

నిర్మల్‌ టౌన్‌: జిల్లా సహకార సంఘాలకు ఈనెల 15న ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాను సోమవారం అధికారికంగా విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు జిల్లా కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఉండగా.. ఇప్పటికే రాష్ట్ర సహకార శాఖ రిజిస్టర్‌ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వెలువరించిన నేపథ్యంలో  ఎన్నిక ప్రక్రియపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఒక్కో సంఘంలో మొత్తం 13 మంది డైరెక్టర్లు మొదటగా ఎన్నుకొని ఆ తర్వాత వారి నుంచే చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.  ఇప్పటికే ఆయా సంఘాల్లో డైరెక్టర్ల రిజర్వేషన్లను కూడా ఖరారు చేశారు. ఎస్సీ (మహిళ-1), ఎస్సీ (జనరల్‌-1), ఎస్టీ (జనరల్‌-1), బీసీ (జనరల్‌-2), జనరల్‌ (మహిళ-2), మిగతావి జనరల్‌ కేటగిరిలుగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. 

సమగ్ర ఓటర్ల జాబితా విడుదల...

 జిల్లావ్యాప్తగా మొత్తం 35,062 మంది ఓటర్లుండగా.. ఇందులో స్త్రీలు 8429, పురుషులు 26633 మంది ఉన్నారు. నిర్మల్‌లో మొత్తం 2900 ఓటర్లుండగా.. మంజులాపూర్‌లో 1614, మామడలో 1625, ఖానాపూర్‌లో 1758, ఆలూరులో 1942, కౌట్లలో 1289, సత్తన్నపల్లి 808, ముఠాపూర్‌లో 1019, బిద్రెల్లిలో 2664, కుభీర్‌లో 2753, కుంటాలలో 2532, హంగిర్గాలో 2416, మిర్జాపూర్‌లో 2517, లోకేశ్వరంలో 1786, లక్ష్మణచాందలో 2304, కడెంలో 3302, బన్సపెల్లిలో 1742మంది ఓటర్లను ఓటు హక్కు వినియోగించేందుకు అర్హులుగా ప్రకటించారు. సంఘ సభ్యులైనప్పటికీ డిఫాల్టర్‌ ఓటరుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం  లేకపోవడంతో ఆయా సంఘాల్లో వారిని గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించారు. 

ఎన్నికల అధికారుల నియామకం...

జిల్లావ్యాప్తంగా ఆయా సహకార సంఘాలకు ఎన్నికల అధికారులను నియమించినట్లు జిల్లా సహకార అధికారి తెలిపారు.  నిర్మల్‌కు మురళీధర్‌, మంజూలాపూర్‌కు జి.వినోద్‌కుమార్‌, ముఠాపూర్‌కు వసంత్‌రావు, కౌట్ల(బి) రాజశేఖర్‌రెడ్డి, ఆలూరుకు మధుసూదన్‌, మామడకు వెంకటేశ్వర్లు, లక్ష్మణచాందకు ఎం.ప్రవీణ్‌కుమార్‌, సత్తన్నపల్లికి ఎ.రవి, కడెంకు ఎన్‌.గోపాల్‌, ఖానాపూర్‌కు ఇబ్రహీం అనిఫ్‌, దిలావర్‌పూర్‌కు స్రవంతి, కుంటాలకు సోమ లింగారెడ్డి, మిర్జాపూర్‌కు సాయికిరణ్‌, హంగిర్గాకు అజ్మీరా భాస్కర్‌, కుభీర్‌కు హైమద్‌, బిద్రెల్లికి అంజిప్రసాద్‌, లోకేశ్వరంకు ఎం.గణేశ్‌ను నియమించారు. వీరంతా ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. జిల్లా కేంద్రంలోని సహకార సంఘ కార్యాలయంలో  ఎన్నికల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన పోలింగ్‌ సామగ్రిని సిద్ధం చేస్తున్నారు. 


logo