శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nirmal - Feb 04, 2020 , 00:15:36

సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి

సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి

నిర్మల్‌ టౌన్‌ : సమష్టి కృషితోనే జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రతి అధికారి కష్టపడి పని చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారుఖీ అన్నా రు. జిల్లా కలెక్టర్‌గా పని చేసి బదిలీపై వెళ్తున్న  ఎం.ప్రశాంతికి అధికారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నదని, అవి ప్రజలకు అందినప్పుడే ప్రభుత్వం, అధికారులపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ టీం వర్క్‌గా పని చేయాలని పేర్కొన్నారు. తనకు తెలంగాణ అంటే ఎంతో అభిమానమని,  తాను హైదరాబాద్‌లోనే చదువుకున్నానని గుర్తు చేశారు.  జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఎం.ప్రశాంతి స్ఫూర్తితో తాను  కూడా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

జిల్లా అనుభూతులు మరువలేనివి.. బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ ఎం.ప్రశాంతి

నిర్మల్‌ కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇక్కడి ప్రజలు, అధికారుల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించామని, జిల్లాలో పని చేసిన అనుభూతి ఎప్పటికీ మరిచిపోనని బదిలీపై వెళ్తున్న కలెక్టర్‌ ఎం.ప్రశాంతి అన్నారు. రెండు సం వత్సరాల పాటు ఇక్క డ పని చేశానని, అధికారులు, ప్రజ లు జిల్లా అభివృద్ధికి సహకరించారన్నారు. నిర్మల్‌ ఎంతో నిర్మలత్వమైందని ఇలాంటి జిల్లాలో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తన హయాంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మొదలుకొని మున్సిపల్‌ ఎన్నికల వరకు అధికారుల సహకారంతోనే విజయవంతమైందని తెలిపా రు.  అధికారుల సహకారంతోనే ఎంతటి గొప్ప కార్యమై నా ముందుకెళ్తుందని, అదే సహకారాన్ని కొత్త కలెక్టర్‌కు అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తు న్న కలెక్టర్‌ ఎం. ప్రశాంతి, కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించిన ముషారఫ్‌ అలీ ఫారుఖీని జిల్లా అధికారులు సన్మానించారు.  ఎస్పీ శశిధర్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, డీఆర్వో సోమేశ్వర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఏఎస్పీ శ్రీనివాస్‌రాజు, జిల్లా గెజిటెడ్‌ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్‌, ఎంపీడీవోల సంఘం నాయకులు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo