గురువారం 02 ఏప్రిల్ 2020
Nirmal - Feb 04, 2020 , 00:14:30

ఉపాధి పనులను వెంటనే పూర్తి చేయాలి

ఉపాధి పనులను వెంటనే పూర్తి చేయాలి

సారంగాపూర్‌: గ్రామాల్లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను వెంటనే పూర్తి చేయాలని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌రెడ్డి అన్నారు. మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు, నర్సరీలు తదితర పనులు త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలో సారంగాపూర్‌ మండలాన్ని ముందుంచాలని సూచించారు. అంతకు ముందు చించోలి(బి), ధని, జామ్‌ గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో జయదేవ్‌, టీఏలు నారాయణ, గంగన్న, ఎఫ్‌ఏ నాగయ్య, కొండాపూర్‌ కస్తూర్బా గాంధీ విద్యాలయం ప్రత్యేక అధికారి శ్రీలత, నాయకులు గంగాధర్‌, ఏజాస్‌ తదితరులు ఉన్నారు.

నేడు బ్యాంకర్లతో సమావేశం

మండల ప్రజాపరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం 2018-2019 సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలకు దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగ యువతకు బ్యాంకర్లతో సమావేశం ఉంటుందని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. రూ.లక్ష రుణానికి పైగా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఈ సమావేశానికి హాజరుకావాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 


logo