బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 04, 2020 , 00:14:30

సహకార చైర్మన్‌ పదవులు బీసీలకే కేటాయించాలి

సహకార చైర్మన్‌ పదవులు బీసీలకే కేటాయించాలి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ : డీసీఎంఎస్‌, డీసీసీబీ చైర్మన్‌, పీఏసీఎస్‌ పదవులు బీసీలకే కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంబడి చంద్రశేఖర్‌ అన్నారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా సహకార సంఘాలకు సంబంధించిన చైర్మన్‌ పదవులను బీసీలకు ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవుల కేటాయింపులో అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత రాజకీయ పార్టీలు చైర్మన్‌ పదవులను బీసీలకు కేటాయించాలని కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం కో-కన్వీనర్‌ రమేశ్‌, అశోక్‌ చారి, దండుగుల జంబులు, మార్కంటి జీవన్‌, మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo
>>>>>>