శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 04, 2020 , 00:11:43

నాగోబా ఆలయ హుండీ లెక్కింపు

నాగోబా ఆలయ హుండీ లెక్కింపు

ఇంద్రవెల్లి: నాగోబా జాతర హుండీని సోమవారం మెస్రం వంశీయులతోపాటు రెవెన్యూశాఖ, దేవదాయశాఖ, ఆలయ కమిటీ, ఐటీడీఏశాఖ, పోలీస్‌శాఖలకు చెందిన అధికారుల ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం రూ.18లక్షల47వేల670 అదాయం వచ్చిందని దేవాదాయ శాఖ ఈవో మహేశ్‌తోపాటు మెస్రం వంశీయులు తెలిపారు. ఇందులో వెండి 948 గ్రాములు, బంగారం 3 గ్రాములు వచ్చిన్నట్లు వారు పేర్కొన్నారు. హుండీలో భక్తులు వేసిన డుబ్బులు 6లక్షల53వేల170, తైబజార్‌ ద్వారా 7లక్షల25వేలు, రంగుల రాట్నాల ద్వారా రూ.90వేలు, విద్యుత్‌ ద్వారా రూ.90,500, టెంకాయల ద్వారా రూ.లక్ష81వేలు, వాహనాల పార్కింగ్‌ ద్వారా రూ.73వేలు, మురుమురా ద్వారా రూ.35వేలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం నాగోబా జాతరలో వేలం నిర్వహించడంతో నాగోబాకు 5లక్షల 23వేల270 రూపాయల ఆదాయం పెరిగిందని మెస్రం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రాఘవేంద్రరావ్‌, గిర్ధవార్‌ మెస్రం లక్ష్మణ్‌, మెస్రం వంశీయులు పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్‌పటేల్‌, ఐటీడీఏ అధికారి రమాదేవి, ఎస్సై గంగారామ్‌, దేవదాయశాఖ ఈవో మహేశ్‌, మాజీ ఈవో రాజమౌళి, సర్పంచ్‌ మెస్రం రేణుకనాగ్‌నాథ్‌, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం అధ్యక్షకార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.logo