శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 03, 2020 , 01:48:26

ట్రిపుల్‌ ఐటీలో ముగిసిన అంతఃప్రజ్ఞ

ట్రిపుల్‌ ఐటీలో ముగిసిన అంతఃప్రజ్ఞ

బాసర ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగిన అంతఃప్రజ్ఞ -2020 (టెక్‌ ఫెస్టివల్‌) ఆదివారం సాయంత్రం ముగిసింది.  వివిధ విభాగాల ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాజెక్టులను వీసీ పరిశీలించారు. ముగింపు కార్యక్రమంలో  సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.


బాసర : బాసర ట్రిపుల్‌ఐటీ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగిన అంతఃప్రజ్ఞ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. చివరి రోజు వీసీ అశోక్‌కుమార్‌ ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ, ఈసీఈ, ఈఈఈ తదితర విభాగాలను సందర్శించి ప్రాజెక్టుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమం కోసం రెండు నెలల నుంచి రాత్రింబవళ్లూ కష్టపడిన హెచ్‌వోడీలు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్లు, విభాగాల కో-ఆర్డినేటర్లను అభినందించారు. 


ఆటపాటలతో హోరెత్తిన ట్రిపుల్‌ఐటీ..

అంతఃప్రజ్ఞ కార్యక్రమంలో భాగంగా శనివారం అర్ధరాత్రి వరకు త్రినయన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. పలువురి సంప్రదాయ నృత్యాలు అలరించాయి. 


logo