ఆదివారం 24 మే 2020
Nirmal - Feb 02, 2020 , 00:26:08

సత్వర సాయం అందించాలి

సత్వర సాయం అందించాలి
  • రోడ్డు ప్రమాద బాధితులకు..
  • పెట్రోలింగ్‌ అధికారులతో సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు
  • జీబ్రా క్రాసింగ్‌, లైటింగ్‌ పోల్స్‌ ఏర్పాటు చేయాలి

నిర్మల్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: రోడ్డు ప్రమాద బాధితులకు పోలీసులు సత్వర సాయం అందించాలని ఎస్పీ శశిధర్‌ రాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారి44, 61 పెట్రోలింగ్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎస్పీ శశిధర్‌రాజు మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. జీబ్రాక్రాసింగ్‌, అవసమైన ప్రదేశాల్లో సైన్‌ బోర్డు లైటింగ్‌ పోల్స్‌  ఏర్పాటు చేయాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించాలని అన్నారు. 2020లో 15శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. హైవేలపై ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అత్యవసర సమయంలో 100 మాదిరిగా నేషనల్‌ హైవే టోల్‌ఫ్రీ 1033 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో  ఏఎస్పీ శ్రీనివాస్‌ రావు, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, సీఐలు జాన్‌దివాకర్‌, జీవన్‌ రెడ్డి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌,  హైవే సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.


logo