ఆదివారం 29 మార్చి 2020
Nirmal - Feb 02, 2020 , 00:07:11

సదర్‌మాట్‌ అటవీ ప్రాంతంలో గుప్తనిధి తవ్వకాల కలకలం

సదర్‌మాట్‌ అటవీ ప్రాంతంలో గుప్తనిధి తవ్వకాల కలకలం

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మండలంలోని సదర్‌మాట్‌ అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వాలని తనను కొంత మంది బలవంతపెట్టారని ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన దాసరి నర్సయ్య అనే వ్యక్తి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ముగ్గ్గురు వ్యక్తులు తనను కూలీ పనికి అని పిలిచి గుప్త నిధుల కోసం తవ్వాలని ఒత్తిడి చేశారని ఆయన పోలీసులకు తెలిపాడు. ఓ వ్యక్తి తన వద్దకు బైక్‌పై  వచ్చి సదర్‌మాట్‌ అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లాడని, అక్కడే ఉన్న మరికొందరు తనతో మద్యం తాగించి గుప్త నిధుల కోసం తవ్వాలని ఒత్తిడిచేశారని లిపాడు. అక్కడి పరిస్థితి ని గమనించి తనకు ఆ పని చేయడం ఇష్టం లేద ని, వెంటనే అంబేద్కర్‌ నగర్‌లోని తన ఇంటి వద్ద వదిలిపెట్టాలని వాగ్వాదానికి దిగా నని పోలీసులకు తెలిపాడు.  సదరు వ్యక్తులతో తనకు ప్రాణ హాని ఉందని, వారిపై చర్య తీసుకొని తన ప్రాణాలను కాపాడాలని ఫిర్యాదులో కోరాడు. సీఐ జయరాం మాట్లాడుతూ దాసరి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, నిజమని  తేలితే బాధ్యులపై చర్యలు తీసు కుంటామని సీఐ తెలిపారు. logo