శనివారం 04 ఏప్రిల్ 2020
Nirmal - Feb 02, 2020 , 00:06:27

న్యూడెమోక్రసీ నాయకుడు విజయ్‌ మృతి తీరనిలోటు

న్యూడెమోక్రసీ నాయకుడు విజయ్‌ మృతి తీరనిలోటు

ఖానాపూర్‌: సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు ముల్లేవార్‌ విజయ్‌కుమార్‌ శుక్రవారం రాత్రి అనారోగ్యంతో పట్టణంలోని సుభాష్‌నగర్‌లో మృతిచెందాడు. నాయకులు, కార్యకర్తలు శనివారం ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి నంది రామయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం పోరాడిన విజయ్‌ మరణం ప్రజాపోరాటాలకు తీరని లోటని  అన్నారు. ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. వామపక్ష పార్టీల నాయకులు కే. రాజ న్న, రాంలక్ష్మణ్‌, దుర్గం నూతన్‌కుమా ర్‌, జక్కుల రాజన్న, కుంచెపు యెల్ల య్య, అడ్డగట్ల శంకర్‌, ముస్కె శంకర్‌, సుదర్శన్‌, కుర్మ రాజన్న, విశ్వకర్మ కుల సంఘ సభ్యులు, నాయకులు నివాళులు అర్పించారు. 


logo