బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 02, 2020 , 00:00:49

ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

ఫిర్యాదులపై వేగంగా స్పందించాలి

ఆదిలాబాద్‌ అర్బన్‌, నమస్తే తెలంగాణ: బాధిత మహిళల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలని ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీ విష్ణువారియార్‌ అన్నారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు  రక్షణ కల్పించడంతో పాటు ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని సూచించారు. షీటీంలకు అన్ని రకాల సహకారం అందించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును రిజిస్టర్‌లో నమోదు చేయాలని, బాధితులు ఫోన్‌లో సమాచారం ఇచ్చినా వారి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించాలని అన్నారు. దర్యాప్తు విషయాలను ఎప్పటికప్పడు బాధితులకు తెలపాలని సూచించారు. మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చట్టాలపై మహిళలకు, విద్యార్థినులకు అవగాహన  కల్పించాలని ఆదేశాంచారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణమూర్తి, వన్‌టౌన్‌ సీఐ వీ.సురేశ్‌, రైటర్లు మమత, మౌనిక, దత్తు, ఏఎస్సై ఆత్మారం, సిబ్బంది పాల్గొన్నారు.


logo
>>>>>>