గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Feb 01, 2020 , 01:57:03

నేటి నుంచి బుడుందేవ్‌ జాతర

నేటి నుంచి  బుడుందేవ్‌ జాతర
  • శనివారం నుంచి వారం రోజులు సాగనున్న జాతర
  • కెస్లాపూర్‌ నుంచి శ్యాంపూర్‌కు చేరుకున్న మెస్రం వంశీయులు

ఉట్నూర్‌ రూరల్‌ :  మండలంలోని శ్యాంపూర్‌ గ్రామంలోని బుడుందేవ్‌ ఆలయంలో మెస్రం వంశీయులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.  గురువారం కెస్లాపూర్‌ నుంచి శ్యాంపూర్‌కు ఎడ్లబండ్లు, కాలినడకన ఇక్కడిరి చేరుకున్న మెస్రం వంశీయులు ఆలయ పరిసరాల్లోనే బస చేశారు. శుక్రవారం ఆలయాన్ని నదీ జలంతో శుద్ధి చేశారు.  తమ తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించనున్నట్లు ఆదివాసీ పెద్దలు తెలిపారు. శనివారం నుంచి జాతర ప్రారంభం కానుంది.  బుడుందేవ్‌ను ఇక్కడి ప్రజలు నందిగా భావిస్తారు. 


logo