గురువారం 09 ఏప్రిల్ 2020
Nirmal - Feb 01, 2020 , 01:56:22

గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే చర్యలు

గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే చర్యలు

నిర్మల్‌ అర్బన్‌,నమస్తే తెలంగాణ : గూడ్స్‌ వాహనాల్లో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో వాహనాల తనిఖీని నిర్వహించారు. తనిఖీల్లో ఐచర్‌ వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా  ప్రయాణికులను తరలిస్తుండగా ఎంవీ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వాహనదారులు నిబంధనలకు లోబడి తమ వాహనాలను నడుపాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీలో ఎస్సై ఆసిఫ్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


logo