బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Feb 01, 2020 , 01:46:34

సమాజ సేవ చేసినప్పుడే గుర్తింపు

సమాజ సేవ చేసినప్పుడే గుర్తింపు

సోన్‌: యువత సమాజ సేవ చేసినప్పుడే గుర్తింపు వస్తుందని ఎస్పీ శశిధర్‌రాజు అన్నారు. శుక్రవారం నిర్మల్‌ మండలంలోని మేడిపెల్లి గ్రామంలో పట్టణంలోని దీక్ష డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరంలో ఆయన పాల్గొన్నారు. విద్యా సంస్థలు ముందుకొచ్చి ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాల్లో భాగంగా గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత, ప్రజలను చైతన్యం చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో నివారణ పద్ధతులను  ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు.  కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై బి.కృష్ణకుమార్‌, సర్పంచ్‌ కుంట పద్మ, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కో-ఆర్డినేటర్‌ హరికృష్ణ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. logo
>>>>>>