మంగళవారం 07 ఏప్రిల్ 2020
Nirmal - Jan 31, 2020 , 03:21:13

బాసర ఆలయాభివృద్ధికి కృషి

బాసర ఆలయాభివృద్ధికి కృషి
  • రూ.50 కోట్లు మంజూరు
  • రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
  • మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం కాగానే టెండర్లు

బాసర: చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతీ తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఐకేరెడ్డి అన్నారు. కేరళ రాష్ట్రం మాదిరిగా అక్షరాస్యతలో తెలం గాణ ముందుండేలా తీర్చిదిద్దుతామని, దీనికోసం అమ్మవారిని కూడా వేడుకున్నామని ఆయన పేర్కొన్నారు. వసంత పంచమి సందర్భంగా గురువారం కు టుంబ సమేతంగా దర్శించుకొని ముథో ల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో పాటు అమ్మవా రికి పట్టువస్రాలను సమర్పించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీ ఎం కేసీఆర్‌ దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఇప్పటికే బాసర దేవాలయానికి రూ. 50కోట్ల నిధులు మంజూ రు చేశామని వెల్లడించారు. మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం కాగానే టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. 


త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బాసరకు వచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే బాసర ఆలయం లో రూ. 25లక్షలతో భక్తులు విడిది చేసేందుకు అతిథి గృహాల ముందు షెడ్డును ని ర్మించామని, ఒక్కోటి పనులు చేస్తామని, త ద్వారా భక్తులు ఇబ్బందులు లేకుండా అతిథి గృహాలను కూడా అదనంగా నిర్మించి వాస్తుకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి రూపురేఖలు మారుస్తామన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడంలో ఆలయ సిబ్బంది, పోలీసులు ముందున్నారని అభినందించారు. మంత్రి వెంట బాసర సర్పంచ్‌ లక్ష్మణ్‌రావు, జడ్పీటీసీ వసంత రమేశ్‌, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, ఎంపీటీసీ ఉమారాణి రమేశ్‌, నాయకులు జిడ్డు మల్లయ్య, నర్సింగ్‌రావు, అరుణ్‌రావు, బల్గం దేవేందర్‌, మల్కన్నయాదవ్‌, వెంకటేష్‌ గౌడ్‌, సంజీవ్‌రెడ్డి తదితరులున్నారు.


ప్రముఖుల పూజలు...

వసంత పంచమి సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ భాస్కర్‌రావు, ఎస్పీ శశిధర్‌రాజు, వరంగల్‌ రేంజ్‌ జైళ్ల శాఖ డీఐజీ రాజేశ్‌, రాష్ట్ర క్రీడా శాఖ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాసరకు చేరుకున్న వీరికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. logo