బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 31, 2020 , 03:20:12

‘పల్లె ప్రగతి’లక్ష్యాలను చేరుకోవాలి

‘పల్లె ప్రగతి’లక్ష్యాలను చేరుకోవాలి

నిర్మల్‌ టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అన్ని గ్రామాల్లో లక్ష్యం మేరకు చేరుకోవాలని కలెక్టర్‌ ఎం.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో పల్లె ప్రగతి కార్యక్రమంపై జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.జనవరి 2 నుంచి 11 వరకు నిర్వహించిన  పల్లె ప్రగతిని అ న్ని గ్రామాల్లో నిర్వహించామని ఆమె తెలిపారు. ము ఖ్యంగా పల్లెలు అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు.  గ్రామాల్లో వందశాతం శ్మశాన వాటికల నిర్మాణం, చెత్త డంపింగ్‌ల ఏర్పాటు, గ్రామానికొక నర్సరీ, హరితహారంలో మొక్కల సంరక్షణ, పచ్చదనం పరిశుభ్రత  తదితర అంశాలపై పల్లె ప్రగతిలో సాధించిన అభివృద్ధిని మండలాల వారీగా సమీక్షించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పల్లె ప్రగతి ముగిసినప్పటికీ పల్లెలో మార్పు నిరంతరంగా కొనసాగించాలని కోరారు. జిల్లాలో పెండింగ్‌ చెత్త డంపింగ్‌యార్డులకు అటవీశాఖ అనుమతితో 50స్థలాలను కేటాయించామని వెల్లడించారు. ఈ స్థలాల్లో చెత్త డంపింగ్‌ల నిర్మాణం, నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పల్లె ప్రగతికి ప్రభుత్వం ప్రతినెలా నిధులను విడుదల చేస్తుందని ఈ నిధులతో ప్రజా ప్రాధాన్యత  పనులకే కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జేసీ భాస్కర్‌రావు, డీఎఫ్‌వో సుదాం, జడ్పీ సీఈ సుధీర్‌కుమార్‌, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్‌, పాల్గొన్నారు. logo
>>>>>>