మంగళవారం 31 మార్చి 2020
Nirmal - Jan 31, 2020 , 03:20:12

రోడ్డు నిబంధనలు పాటించాలి

రోడ్డు నిబంధనలు పాటించాలి

ఖానాపూర్‌: వాహనాలు నడిపే వారు ప్రతీ ఒక్కరు ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని నిర్మల్‌ జిల్లా రవాణా శాఖ ఎంవీఐ జే. కవిత అన్నారు. గురువారం ఖానాపూర్‌లో ఎస్సై భవానీసేన్‌తో  కలిసి 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ నుంచి తెలంగాణ చౌరస్తా, లారీ అడ్డా, విద్యానగర్‌ వరకు నడిచి హెల్మెట్లు లేకుండా, సీటు బెల్టు లేకుండా ద్విచక్రవాహనాలు, కార్లు నడుపుతున్న వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం, అధికారులు ప్రజల్లో అవగాహన పెంచుతున్నా గాని వాటిని పట్టించుకోకపోవడంతోనే ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని పేర్నొన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితమైన ప్రయాణం చేయాలని వారు సూచించారు. logo
>>>>>>