శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Nirmal - Jan 31, 2020 , 03:19:27

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలి


దిలావర్‌పూర్‌: ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకంపై మహిళలకు అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళీ అన్నా రు. గురువారం మండలకేంద్రంలోని మైనార్టీ సంఘ భవనంలో కలాం గుణం ఎడ్యూకేషన్‌, యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ సంక్షేమ పథకాలు - వాటి వినియోగం’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికా భివృద్ధి కోసం అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మైనార్టీ మహిళలకు సబ్సిడీపై కుట్టుమిషన్‌లను అందించిందన్నారు. కార్యక్రమంలో కలాం సొసైటీ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ ఉస్మాన్‌, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు అన్వర్‌ఖాన్‌, మైనార్టీ సంఘ భవన అధ్యక్షుడు వసీం, టీఆర్‌ఎస్‌ నాయకులు షేక్‌ హరుణ్‌, సయ్యద్‌ అమీన్‌, బాబా తదితరులున్నారు. 


logo