బుధవారం 01 ఏప్రిల్ 2020
Nirmal - Jan 30, 2020 , 01:37:18

వరుడి పరారీతో ఆగిన పెండ్లి

వరుడి పరారీతో ఆగిన పెండ్లి

 ముథోల్‌ : మండల కేంద్రమైన ముథోల్‌లో పెండ్లి కొడుకు కనిపించకపోవడంతో పెండ్లి ఆగిపోయింది. వివరాలను పరిశీలిస్తే ముథోల్‌ మండల కేంద్రానికి చెందిన యువకుడికి లోకేశ్వరం మండలం పొట్‌పెల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో  పెండ్లి నిశ్చయమైంది.  బుధవారం పెండ్లి జరగాల్సి ఉంది. మంగళవారం  సాయంత్రం నుంచి  వరుడు కనిపించకుండాపోయాడు. స్థానిక బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు, దీంతో ముథోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో వరుడి కుటుంబీకులు  ఫిర్యాదు చేశారు. పెండ్లి కొడుకు ఇల్లరికం పోవడానికి ఇష్టం లేకపోవడంతో పరారైనట్లు కుటుంబీకులు, పోలీసులు అనుమానిస్తున్నారు. 


logo
>>>>>>